నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘సర్వాయి పాపన్న’

నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘సర్వాయి పాపన్న’

కరీంనగర్ : నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు సర్వాయి పాపన్న డాక్యుమెంటరీ ఎంపికైంది. నోయిడాలో ఈ నెల 29వ తేదీన జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సర్వాయి పాపన్న డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. కరీంనగర్ కు చెందిన పొన్నం రవిచంద్ర రూపొందించిన సర్వాయి పాపన్న డాక్యుమెంటరీకి కత్తి చేతన్ దర్శకత్వం వహించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైన 17 డాక్యుమెంటరీలలో ఇండియా నుంచి 5 మాత్రమే ఎంపికయ్యాయి.