
హైదరాబాద్, వెలుగు: సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడి అమరులయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఈ తరం కూడా కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో అన్యాయాలు, అత్యాచారాలు జరిగే ప్రతి సందర్భంలోనూ పోరాడే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరారు.
సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్ తదితరులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.