సశస్త్ర సీమ బల్ సబ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్–బి నాన్ గెజిటెడ్ (కంబాటైడ్జ్) & నాన్ మినిస్ట్రియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 51.
విభాగాల వారీగా ఖాళీలు: సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) 10, సబ్ ఇన్స్పెక్టర్ (పయోనీర్) 21, సబ్ ఇన్స్పెక్టర్ (కమ్యూనికేషన్) 20.
ఎలిజిబిలిటీ
సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పూర్తిచేసి ఉండాలి. జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ ఉత్తీర్ణతతోపాటు కేంద్ర/ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్లో నమోదై ఉండాలి.
సబ్ ఇన్స్పెక్టర్ (పయోనీర్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
సబ్ ఇన్స్పెక్టర్ (కమ్యూనికేషన్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తదితర సైన్స్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 21.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 20.
సెలెక్షన్ ప్రాసెస్
పీఈటీ & పీఎస్టీ (శారీరక పరీక్షలు): పురుషులు 1.6 కి.మీ. పరుగును 6 నిమిషాల 30 సెకండ్లలో పూర్తిచేయాలి. మహిళలు 800 మీటర్ల పరుగును 4 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. మాజీ సైనికులకు పీఈటీ నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు నిర్దేశించిన ఎత్తు, ఛాతీ ప్రమాణాలను (నోటిఫికేషన్ ప్రకారం పోస్టులవారీగా, కేటగిరీల వారీగా) కలిగి ఉండాలి.
రాతపరీక్ష: రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా ఓఎంఆర్ షీట్ ద్వారా నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. పార్ట్-–Iలో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్/ జనరల్ హిందీ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు. పార్ట్–-IIలో సంబంధిత టెక్నికల్ సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఇందులో అర్హత సాధించాలంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
వైద్య పరీక్ష: చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssb.gov.in ను సందర్శించండి.
