బార్డర్లో సీక్రెట్గా డ్యాం కడ్తున్నచైనా

బార్డర్లో సీక్రెట్గా డ్యాం కడ్తున్నచైనా
  • శాటిలైట్ ఫొటోల ద్వారా వెల్లడి

న్యూఢిల్లీ: ఇండో చైనీస్ బార్డర్ వెంబడి వివాదాస్పద స్థలాల్లో తరచూ నిర్మాణాలు చేపడుతున్న చైనా.. కొత్తగా ఓ నదిపై డ్యాంను కూడా కడుతున్న విషయం శాటిలైట్ ఫొటోల ద్వారా బయటపడింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి.. టిబెట్, ఇండియా, నేపాల్ బార్డర్​లు కలిసే ట్రై జంక్షన్​కు దగ్గర్లో టిబెట్ భూభాగంలోని మాబ్జా జాంగ్బో నదిపై 2021 నుంచే చైనా ఈ డ్యాంను కడుతున్నట్లు డేమియన్ సైమన్ అనే జియోస్పేషియల్ రీసెర్చర్ వెల్లడించారు. శాటిలైట్ ఇమేజెస్​ను బట్టి చూస్తే.. సుమారు 400మీటర్ల పొడవున డ్యాం నిర్మాణం కొనసాగుతున్నట్లు కన్పిస్తోందని తెలిపారు. టిబెట్ భూభాగంలో కడుతున్న ఈ డ్యాంతో ఇండియాకు ముప్పు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, జాంగ్బో నది మన దేశంలో ప్రవహించే గంగానదికి ఉపనది కూడా కావడం ప్రమాదకరం కానుంది. ఈ డ్యాం పూర్తయితే, ఈ నదిలో పెద్ద ఎత్తున నీళ్లను చైనా ఆపేయగలదని, కావాలనుకుంటే ఒకేసారి నీటిని వదిలి దిగువ ప్రాంతాల్లో వరదలు వచ్చేలా చేయగలదని చెప్తున్నారు.