హైదరాబాద్ మెయిన్ ఏరియాల్లో శాటిలైట్ సెంటర్లు

హైదరాబాద్ మెయిన్ ఏరియాల్లో శాటిలైట్ సెంటర్లు
  •      స్థానికంగానే షాపింగ్​కు వెసులుబాటు
  •     కస్టమర్లను ఆకర్షించేలా ఏర్పాట్లు
  •     దేశ, విదేశీ బ్రాండ్లు అందుబాటులోనే..
  •     ‘హైపర్  లోకల్​‘గా మార్కెట్​ గా మార్పు 
  •     రోజుకు కోట్లలో నడుస్తున్న బిజినెస్​లు 

హైదరాబాద్, వెలుగు :  విశ్వనగరం వైపు సిటీ దూసుకుపోతుండగా.. అదేస్థాయిలో వ్యాపార సంస్థలు  ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా షాపింగ్ ​ప్రియులను ఆకట్టుకునేందుకు పలు సంస్థలు బిజినెస్  సెంటర్లు ప్రారంభిస్తున్నాయి. ఇలా గ్రేటర్​ సిటీలో శాటిలైట్ ​టౌన్​షిప్​ల మాదిరిగా ‘శాటిలైట్ ​షాపింగ్’ సెంటర్లు విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు పట్నంలో షాపింగ్ ​కోసం అబిడ్స్, సుల్తాన్​బజార్, కోఠి వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడలా కాదు.. సిటీలో ప్రతి ప్రధాన చౌరస్తాలో న్యూఏజ్ ​షాపింగ్​ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా దుస్తులు, జువెలరీ, ఎలక్ర్టానిక్, చెప్పులు ఇలా తదితర బ్రాండెడ్ వస్తువులు కొనుగోలు చేసేవారికి తమ ప్రాంతంలోనే ​మాల్స్ ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలా సిటీలో ప్రతి ప్రాంతంలోనూ హైపర్​ లోకల్​గా భారీస్థాయిలో వెలిసిన మాల్స్ కస్టమర్లను ఆహ్వానిస్తున్నాయి. 

ఒకప్పుడు షాపింగ్ చేయాలంటే..

 పండగలు, పెళ్లిళ్లు, పుట్టినరోజు ఇలా వేడుక ఏదైనా  సందర్భాన్ని బట్టి షాపింగ్ ​చేస్తుంటారు. ఒకప్పుడు షాపింగ్​ అంటే  పదుల కిలో మీటర్ల దూరంలోని షాపింగ్ ​సెంటర్లకు వెళ్లి గంటల తరబడి ఇబ్బంది పడుతూ చేసేవారు. ఒకప్పుటి అబిడ్స్, సుల్తాన్​బజార్, కోఠి, సికింద్రాబాద్ తదితర ఏరియాలను మరిపించే రీతిలో ప్రస్తుతం షాపింగ్ ​మాల్స్ వెలిశాయి. దిల్​సుఖ్​నగర్​పరిసర ప్రాంతాల్లో ఉండేవారు దిల్​సుఖ్ నగర్​లో.. మల్కాజిగిరి, కుషాయిగూడ, నేరేడ్​మెట్​వంటి ప్రాంతాలకు ఏఎస్​రావునగర్​లో.. మూసాపేట, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఉండే వారికి కూకట్​పల్లిలో.. బేగంపేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లోని ఉంటే అమీర్​పేటలో.. టోలీచౌకి, రాయదుర్గం, మాసబ్​ట్యాంక్​ వంటి ప్రాంతాల్లో ఉండేవారికి మెహిదీపట్నంలో ..ఇలా  ప్రధాన ఏరియాల్లో మాల్స్ వచ్చాయి.  అంతేకాకుండా సిటీ శివారులో భారీగా నిర్మిస్తున్న శాటిలైట్​టౌన్​ షిప్​ల్లో నివసించే వారికి కూడా స్థానికంగానే మాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రేటర్​సిటీ పరిధిలో పెద్దస్థాయిలో వెలిసిన బిజినెస్ సెంటర్లు స్థానిక జనాలకు అందుబాటులో ఉంటూ అవసరాలు తీరుస్తున్నాయి. 

సిటీ పరిధి, జనాభా పెరుగుతుండగా..

సిటీ పరిధి విస్తరిస్తుండగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో జనాభా కూడా పెరుగుతోంది. ఇలా పెరిగే జనాభా అవసరాలు తీర్చడంతో పాటు వ్యాపారులు కూడా బిజినెస్​లను డెవలప్ చేసుకుంటున్నారు. వస్త్రాలకు సీఎంఆర్, చెన్నై, సౌత్​ఇండియా, కళామందిర్, కేఎంఎల్, జస్ట్​ ఫర్ ​యూ,  వర మహాలక్ష్మి షోరూం లాంటి తదితర షాపింగ్ మాల్స్​తో పాటు మ్యాక్స్​, వాన్ హుసేన్​, పాన్​అమెరికా, పీటర్ ​ఇంగ్లాండ్, పోలో వంటి విదేశీ బ్రాండెడ్ ​కంపెనీలు కూడా తమ షోరూమ్​లను ప్రారంభించాయి. జువెలరీ పరంగా ఖజానా, జోయ్​అలుక్కాస్​, మలబార్ ​గోల్డ్, కళ్యాణ్, సీఎంఆర్, లలితా జువెలరీ.. ఎలక్ర్టానిక్స్​కు వస్తే శాంసంగ్, ఎంఐ, ఎల్​జీ, బజాజ్, హయర్, వరల్ ఫూల్ వంటి షోరూంలు తమ బ్రాంచ్​లను ఏర్పాటు చేశాయి. ఇలా ఏ వస్తువు బ్రాండ్​అయినా సిటీవాసులు తమ ప్రాంతాల్లోని షోరూమ్​ల్లో అందుబాటులో లభిస్తున్నాయి. 

మార్కెటలోని పోటీ కారణంగా..

బహిరంగ మార్కెట్​లో పెరిగిపోయిన పోటీతో పాటు కంపెనీలు కూడా విస్తరించుకుంటున్నాయి. తమ ఉత్పత్తులు ప్రతి కస్టమర్​కు చేరాలనే లక్ష్యంతో ఆకర్షిస్తున్నాయి. ఇలా దేశ, విదేశీ కంపెనీలు పోటీ పడుతూ తమ బిజినెస్​లను డెవలప్ చేసుకుంటున్నాయి.   ఆఫర్లు ఇస్తూ, ఆకట్టకునే రీతిలో ప్రచారం చేస్తూ.. వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తద్వారా  బిజినెస్ కూడా భారీగానే పెరుగుతుందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. జువెలరీ అమ్మకాల్లో ఒక్కోసెంటర్​లో రోజుకు రూ. 5 కోట్ల నుంచి 8 కోట్ల బిజినెస్ అవుతున్నట్టు దిల్​సుఖ్​నగర్​కు చెందిన వ్యాపారి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఎలక్ర్టానిక్స్​లో రూ. 5 నుంచి 6 కోట్లు, వస్త్రాలపై రోజుకు రూ. 10 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. 

 న్యూ వేవ్ షాపింగ్ పై ఇంట్రెస్ట్

 దేశ, విదేశాల బ్రాండెడ్ కంపెనీలు సిటీలో బిజినెస్​లు డెవలప్ చేసుకుంటున్నాయి.  ఫేవరేట్ బ్రాండ్​ను  కొనేందుకు కస్టమర్లు కూడా దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా అన్నీ స్థానికంగానే అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో వాటిని కొనేందుకు కస్టమర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. న్యూ వేవ్ ​షాపింగ్​కు సిటీవాసులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో హైపర్​ లోకల్​షాపింగ్ కల్చర్​ కూడా పెరిగింది. 

– రామచందర్, పబ్లిసిస్ట్ 

నచ్చిన వస్తువు దొరికితే చాలు.. 

శాటిలైట్ ​షాపింగ్ సిటీ వాసుల్లో భాగమైంది. ఇంటి ముంగిట్లోకే తమకు కావలసినవి అన్నీ తెప్పించుకుంటున్నారు. ఖర్చుకు వెనుకాడడం లేదు. నచ్చిన ప్రొడక్ట్ దొరికితే చాలు..  రేటు ఎంతైనా చెల్లిస్తున్నారు. దీంతో కస్టమర్ ​బెనిఫిట్ ​కోసం వ్యాపారులు కూడా తమ బిజినెస్​ను డెవలప్ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో షాపింగ్​ రూపురేఖలు ఇంకా మారిపోవచ్చు. 

– అరవింద్ శర్మ, ఆక్సెంబర్గ్ ​డిస్ట్రిబ్యూటర్