బేగంపేటలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం..

బేగంపేటలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం..

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. గురువారం ( అక్టోబర్ 23 ) అపస్మారక స్థితిలో మృతురాలిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

మృతురాలు అస్సాం రాష్ట్రానికి చెందిన లీసాగా ప్రాథమిక విచారణలో గుర్తించారు.. ఆమె బేగంపేటలో హోటల్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్తికి తరలించారు పోలీసులు. మృతురాలి ముఖంపై తీవ్రమైన గాయాలు ఉండడంతో హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. లీసాను ఎవరి హత్య చేసి ఉంటారు, హత్యకు గల కారణాలేంటి, హత్యేనా లేక హత్యాచారామా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.