వర్షాలతో అలర్ట్​గా ఉండాలి

వర్షాలతో అలర్ట్​గా ఉండాలి
  • ఎమ్మెల్యే మట్టా రాగమయి

తల్లాడ, వెలుగు: వర్షాలు, వరదలతో అధికారులు, ప్రజలు అలర్ట్​గా ఉండాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టారాగమయి సూచించారు. ఆదివారం తల్లాడ మండలంలో నారాయణపురం, పాత పినపాక, మంగాపురం గ్రామాల్లో ఆమె పర్యటించారు. జలమయమైన లోతట్టు ప్రాంతాలను కాంగ్రెస్ జిల్లా నాయకుడు మట్టా దయానంద్ తో కలిసి పరిశీలించారు. నారాయణపురంలో ఇండ్లలోకి వరద వచ్చే అవకాశం ఉండటంతో ఆ కుటుంబాలను పునరావస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు.

పాత పినపాక సమీపంలోని ఉధృతంగా ప్రవహిస్తున్న కల్లూరు వాగు, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఏటి పై ఉన్న బ్రిడ్జికి రిపేర్లు చేయాలని స్థానికులు కోరడంతో రిపేర్లకు అంచనా వేయాలని అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో చంద్రమౌళి, నాయకులు రాయల రాము, దగ్గుల నాగిరెడ్డి, పొట్టేటి జనార్దన్ రెడ్డి, గొడుగునూరి శ్రీనివాసరెడ్డి, తుమ్మలపల్లి రమేశ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.