జ్యోతిష్యం: శని ప్రయాణంలో మార్పు జరిగింది.. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది..!

జ్యోతిష్యం:  శని ప్రయాణంలో మార్పు జరిగింది..  ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది..!

శని మంచి.. చెడు పనుల ఫలితాలను నిర్ణయిస్తాడు, కర్మ ఫల దాత అనే బిరుదును సంపాదిస్తాడు. అందువల్ల  శని  సంచారం మారినప్పుడు 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు.   అలాంటి శనిభగవానుడు నవంబర్​ 28 ఉదయం 7:24 గంటలకు మీన రాశిలో తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి తిరిగాడు. శని మీనరాశిలో ప్రత్యక్ష గమనం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. . .

నవగ్రహాల్లో శని న్యాయదేవత.. శని దృష్టి సక్రమంగా లేకపోతే జ్యోతిష్యం ప్రకారం వారు చాలా కష్టాలు పడతారు.  కొంతమంది శనిభగవానుడు ఏలినాటి శని రూపంలో పట్టి పీడిస్తుంటాడు. శని అనుగ్రహం లేకపోతే    జీవితంలో స్థిరత్వం ... ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. 

మేష రాశి: మీనరాశిలో శని ప్రత్యక్ష గమనం వలన ఈ రాశి వారికి కెరీర్​ విషయంలో అనేక మార్పులు సంభవిస్తాయి.  ఆర్థికంగా అభివృద్ది చెందుతారు.  ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.  ఉద్యోగస్తులకు వేతనం పెరుగడంతోపాటు ప్రమోషన్​వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయమని పండితులు చెబుతున్నారు.

వృషభ రాశి  : ఈ రాశి వారికి .. మీన రాశిలో  శని ప్రత్యక్షంగా మారడం వలన కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు చాలా ఓపికకగా ఉండాలి.  ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు.  ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి.  ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు.  ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉంటాయి.  ఉద్యోగస్తులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు..

మిథున రాశి  : ఈ రాశి వారికి శని భగవానుడు ప్రత్యక్ష  సంచారం కారణంగా  మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి.  ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాలపై శ్రద్ద చూపించాల్సిన అవసరం ఉంటుంది.  ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు వస్తాయి. ఈ రాశి వారికి మానసిక అశాంతి కలుగుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలలో అతిగా నమ్మడం అనర్ధాలకు దారితీస్తుంది. గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దని పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ఎవరితోనూ అనవసరంగా వాదించవద్దని పండితులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూలావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి.  ఆర్థిక పరంగా ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి.  

సింహ రాశి :  శని భగవానుడు సంచారంలో మార్పువలన ఈ రాశి వారికి  జీవితంలో కొత్త మార్పులు జరిగే అవకాశం ఉంది.  చాలా కాలంగా పెండిగ్​ లో ఉన్న పనులను పూర్తి  చేయగలుగుతారు. కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పులు లాభాలు వస్తాయి. ముఖ్యమైన పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. పనికి సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. పూర్వీకుల ఆస్థి కలసి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  

కన్య రాశి వారు  : శనిభగవానుడు .. మీన రాశిలో ప్రత్యక్ష సంచారం వలన ఈ రాశి వారు  కొత్త సవాళ్లను  ఎదుర్కోవలసి ఉంటుంది.   ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. ప్రశాంతంగా ఉండి శని దేవుడిని పూజించాలని పండితులు సూచిస్తున్నారు..  నిదానంగా పరిస్థితులు అనుకూలంగా  మారతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చాలా సమయం ఓపికగా ఉండాలి. విదేశీ ప్రయాణం.. వ్యాపారానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా మారతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  నిదానంగా ప్రతికూలత ప్రభావం తగ్గడంతో ..కొంత ఉపశమనం కలుగుతుంది.

తులా రాశి: ఈ రాశి వారికి శని..మీన రాశిలో ప్రత్యక్ష దిశలో సంచారం  ఊహించని లాభాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు విజయాలను అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఆత్మవిశ్వాసం పెరిగి ఎన్నో లాభాలు కలుగుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.  గతంలో మిమ్మలను ఇబ్బంది పెట్టిన వారు  కష్టాలు పడతారు.  ఉద్యోగస్తులు ప్రశంశలుపొందుతారు.  ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

వృశ్చిక రాశి :   శని భగవానుడు  ప్రత్యక్షంగా మారడం వలన ఈ రాశి వారికి  చాలా విషయాల్లో రిలాక్స్​ను పొందుతారు.  వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలను పొందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. కెరీర్ కూడా బాగుంటుంది. అదృష్టం పెరుగుతుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఉద్యోగంలో కీలకబాధ్యతలు పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  గతంలో నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి.  ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

ధనుస్సు రాశి:  శని భగవానుడు మీన రాశిలో ప్రత్యక్షంగా సంచరించడం వలన ఈ రాశి వారికి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.  సహోద్యోగుల విషయంలో అప్రత్తంగా ఉండండి. ఇ తరులతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.  అనవసరంగా ఎవరితో మాట్లాడవద్దు, సాధ్యమైనంతవరకు సైలంట్​ గా ఉండాలని పండితులు చెబుతున్నారు.  కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.  ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో  జీర్ణక్రియ..  మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.   ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి.  ఏ విషయంలో కూడా తొందరడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

మకర రాశి : శని భగవానుడి సంచారంలో మార్పు వలన ఈ ఈ రాశి వారు  ఆరోగ్యం విష యంలో జాగ్రత్తలు తీసుకోవాలి.   మిగతా విషయాల్లో గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు . వీరిలో నాయకత్వ సామర్థ్యాలు  పెరుగుతాయి . కెరీర్ విషయంలో మంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గణనీయమైన లాభాలను పొందుతారు. ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. ప్రేమ.. పెళ్ళి వ్యవహారాలు కలసి వస్తాయి

కుంభ రాశి: ఈ రాశికి అధిపతి శని.. శని భగవానుడు ప్రత్యక్షంగా మీనరాశిలో సంచారం వీరికి బాగా కలసి వస్తుంది. పెండిగ్​ పనులు పూర్తవుతాయి.  కొత్త ప్రాజెక్ట్​లకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.  మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.  ఉద్యోగంలో కీలకబాధ్యతలు పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  గతంలో నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి.   నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.   వ్యాపారస్తులకు తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు వస్తాయి.  ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మీన రాశి: ఈ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు.  పెట్టుబడి పెడితే బాగా రాబడి వస్తుంది. శని దేవుని ఆశీస్సులతో మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.  కెరీర్​ లో మంచి సక్సెస్​ ను అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.  వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో అనుకున్న కలలు నెరవేరుతాయి. భూములు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు. వాహన యోగం కూడా ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.