హాంకాంగ్‌‌‌‌‌‌‌రన్నరప్‌‌‌‌‌‌‌‌గా లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ ..సాత్విక్‌‌‌‌‌‌‌‌-చిరాగ్‌‌‌‌‌‌‌‌ జోడీ కూడా..

హాంకాంగ్‌‌‌‌‌‌‌రన్నరప్‌‌‌‌‌‌‌‌గా లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ ..సాత్విక్‌‌‌‌‌‌‌‌-చిరాగ్‌‌‌‌‌‌‌‌ జోడీ కూడా..

హాంకాంగ్‌‌‌‌‌‌‌‌: హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో రెండు టైటిల్స్‌‌‌‌‌‌‌‌ గెలిచే సువర్ణావకాశాన్ని ఇండియా షట్లర్లు చేజేతులా జారవిడుచుకున్నారు. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నారు. 

సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో లక్ష్య 15–21, 12–21తో వరల్డ్‌‌‌‌‌‌‌‌ నాలుగో ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ లీ షి ఫెంగ్‌‌‌‌‌‌‌‌ (చైనా) చేతిలో ఓడాడు. ముఖాముఖి పోరులో 7–6 లీడ్‌‌‌‌‌‌‌‌తో ఉన్న లక్ష్య.. 45 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తేలిపోయాడు. ఇక డబుల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ 21–19, 14–21, 17–21తో లియాంగ్‌‌‌‌‌‌‌‌ వీ కెంగ్‌‌‌‌‌‌‌‌–వాంగ్‌‌‌‌‌‌‌‌ చాంగ్‌‌‌‌‌‌‌‌ చేతిలో పోరాడి ఓడారు. 61 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తొలి గేమ్ నెగ్గి టైటిల్‌‌‌‌పై ఆశలు రేపిన సాత్విక్–చిరాగ్ జోడీ తర్వాతి రెండు గేమ్స్‌‌‌‌లో అనూహ్యంగా తడబడి సిల్వర్ మెడల్స్‌‌‌‌తో సరిపెట్టుకుంది.