ఇండియా ఓపెన్‌‌‌‌ ఫైనల్లో సాత్విక్‌‌‌‌-చిరాగ్‌‌‌‌ జోడీ

ఇండియా ఓపెన్‌‌‌‌ ఫైనల్లో సాత్విక్‌‌‌‌-చిరాగ్‌‌‌‌ జోడీ

న్యూఢిల్లీ: ఇండియా డబుల్స్ స్టార్స్ సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ షెట్టి.. ఇండియా ఓపెన్‌‌‌‌లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌ సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ 21–18, 21–14తో నాలుగోసీడ్‌‌‌‌ ఆరోన్‌‌‌‌ చియా–సోహ్‌‌‌‌ వుయ్‌‌‌‌ యిక్‌‌‌‌ (మలేసియా)పై గెలిచారు. మెన్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రణయ్‌‌‌‌ 15–21, 5–21తో ఆరోసీడ్‌‌‌‌ షి యు కీ (చైనా) చేతిలో ఓడిపోయాడు.