
షెన్‌జెన్ (చైనా): ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ షెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీఫైనల్లో ఇండియా ద్వయం 21–-17, 21–-14తో మలేసియాకు చెందిన మాజీ వరల్డ్ చాంపియన్స్ ఆరోన్ చియా– సో వూయి యిక్‌పై వరుస గేమ్స్‌లో గెలిచింది.41 నిమిషాల్లోనే ఆట ముగించిన సాత్విక్–చిరాగ్ తొలి గేమ్ నుంచే దూకుడుగా ఆడారు. రెండో గేమ్‌లో కూడా అదే జోరును కొనసాగించారు. ఇండియా ప్లేయర్ల పవర్‌ఫుల్ స్మాష్‌లు, ఫ్రంట్ కోర్ట్ స్కిల్స్ మలేసియా జోడీని పూర్తిగా నిస్సహాయంగా మార్చాయి.