జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీ రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అయ్యానంటున్న సత్య...

జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీ రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అయ్యానంటున్న సత్య...

సత్య  లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రితేష్ రానా రూపొందించిన చిత్రం ‘జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీ’.   మైత్రి  మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించారు. మే 1న విడుదలైంది.  సినిమాకొస్తున్న రెస్పాన్స్ తెలియజేస్తూ శనివారం ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు మేకర్స్.  ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ ‘థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది.  నిజంగా కళ్లల్లో నీళ్లు వచ్చాయి.  వాళ్ల ప్రేమ చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. 

ఈ  జర్నీలో నాకు సపోర్ట్ చేసిన​ అందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. దర్శకుడు రితేష్ మాట్లాడుతూ ‘నాకు రొటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భిన్నంగా ఉండే సినిమాలు చేయాలని ఉంటుంది.  అలాంటి ఐడియాలు ఎప్పుడు  చెప్పినా, నాకంటే  చెర్రీ గారు ఎక్కువ ఎక్సయిట్ అవుతారు. ఈ కథ కూడా  ఆయనకి చాలా నచ్చింది.  సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్పెషల్ థ్యాంక్స్’ అని అన్నాడు. 

నిర్మాత చెర్రీ మాట్లాడుతూ ‘ఎవరూ ప్రయత్నించని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా ఇది. ఈ సినిమా ప్రేక్షకుల మధ్య సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ల్యాండ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. థియేటర్ల   నుంచి యూనానిమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పాజిటివ్  రెస్పాన్స్ వస్తోంది.   కలెక్షన్స్ కూడా బావున్నాయి’ అని చెప్పారు. నటులు అజయ్, గుండు సుదర్శన్ పాల్గొన్నారు.