కెరీర్ స్టార్టింగ్‌‌లో చేయాల్సిన లవ్ స్టోరీ: సత్యదేవ్

కెరీర్ స్టార్టింగ్‌‌లో చేయాల్సిన లవ్ స్టోరీ: సత్యదేవ్

సత్యదేవ్, తమన్నా జంటగా నాగశేఖర్ రూపొందించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’.  చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ కలిసి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ ‘కెరీర్ స్టార్టింగ్‌‌లో చేయాల్సిన లవ్ స్టోరీ ఇప్పుడు చేయడం కొత్తగా ఉంది. అందులోనూ నాలుగు డిఫరెంట్ లవ్ స్టోరీస్‌‌ ఉంటాయి. స్కూల్ స్టేజ్ నుంచి జీవితంలోని నాలుగు దశలు ఉండటంతో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. మూడు డిఫరెంట్ గెటప్స్‌‌లో కనిపిస్తాను. కాలేజ్ ఎపిసోడ్ మాత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ‘గుర్తుందా శీతాకాలం’ ఈ జనరేషన్ ‘గీతాంజలి’ అవుతుంది’ అన్నాడు.

‘క్యామియో రోల్ అయినా ఇది నాకు చాలా స్పెషల్. దివ్య అనే బబ్లీ క్యారెక్టర్‌‌‌‌లో కనిపిస్తాను’ అని  చెప్పింది మేఘా ఆకాష్. ‘తెలుగులో ఇది నా డెబ్యూ మూవీ. టైటిల్ సజెస్ట్ చేసిన హీరో గారికి థ్యాంక్స్’ అని చెప్పాడు నాగశేఖర్. ఈ శీతాకాలంలో ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఈ సినిమా ఉంటుందన్నారు నిర్మాత రామారావు.  రైటర్ లక్ష్మి భూపాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నవీన్ రెడ్డి, చిత్ర సమర్పకులు సుబ్బారావు పాల్గొన్నారు.