క్యాండీ క్రష్ ​క్రేజ్.. సత్యనాదెళ్ల కూడా ఆ లిస్టులో

క్యాండీ  క్రష్ ​క్రేజ్.. సత్యనాదెళ్ల కూడా ఆ లిస్టులో

క్యాండీ క్రష్​.. ఈ మొబైల్​ గేమ్​ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.  అప్పట్లో మాజీ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోని సైతం విమానంలో క్యాండీ క్రష్​ ఆడుతున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​అయింది. ఆ వీడియో అప్ లోడ్​ చేసిన మూడు గంటల వ్యవధిలో 3.5 లక్షల కంటే ఎక్కువగా గేమ్​ డౌన్​లోడ్​ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ధోని క్రేజ్​ అంటే అలా ఉంటుంది మరి అనుకున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు మరొకరు క్యాండీ క్రష్​ ప్రేమికుడిగా మారారు. ఆయన మరెవరో కాదు.. ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్​ సీఈవో సత్యనాదేళ్ల. ఆయనే స్వాయన ఓ జడ్జితో ఈ విషయాన్ని చెప్పడం విశేషం. 

యాక్టివిజన్​ బ్లిజార్డ్​ అనే వీడియో గేమింగ్​ కంపెనీ కొనుగోలు ట్రాన్సాక్షన్స్​సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఫ్రాన్సిస్కో ఫెడరల్​ కోర్టుకి సత్యనాదెళ్ల హాజరయ్యారు. ఈ క్రమంలో జడ్జికి, సత్యకు మధ్య కొద్ది సేపు సరదా సంభాషణ జరిగింది. క్యాండీ క్రష్​ గేమ్​ గురించి అభిప్రాయం చెప్పమని న్యాయమూర్తి సత్య నాదెళ్లను అడిగారు. క్యాండీ క్రష్​గేమ్​ అంటే తనకు ఇష్టమని.. చాలా బాగా ఆస్వాదిస్తానని ఆయన సమాధానం ఇచ్చారు.

దాంతో పాటు కాల్​ ఆఫ్ డ్యూటీ గేమ్​ కూడా ఆడుతుంటానని చెప్పడంతో కోర్టులో ఉన్నవారంతా సరదాగా నవ్వారు. తనకు మొబైల్​ గేమ్స్​ అంటే ఇష్టమని సత్య చెప్పారు. మైక్రోసాఫ్ట్​ ద్వారా గేమ్​లను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. అంత‌టి వారే.. ఇలా చిన్న పిల్ల‌ల్లా మొబైల్ గేమ్స్ ఆడుతుంటే.. ఇక మిగ‌తా వాళ్లు ఆ మాత్రం ఆడ‌కుండా ఉంటారా ఏంటీ..