సత్య లీడ్ రోల్‌లో రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెట్లీ’. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు.
శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఫైనల్ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. వెన్నెల కిశోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘మత్తు వదలరా’ మూవీకి వర్క్ చేసిన మెయిన్ టీం ఈ సినిమాకు పని చేస్తున్నారు. మ్యూజిక్ కాల భైరవ, సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్‌తో కలిసి రితేష్ రానా మరోసారి తనదైన హాస్యాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు.
