ఊరు రమ్మంది

ఊరు రమ్మంది

కొత్త తరహా కాన్సెప్టులతో ఆకట్టుకునే  సత్యదేవ్, ఇప్పుడు ‘గాడ్సే’ అంటూ  మరో డిఫరెంట్ సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌తో రాబోతున్నాడు. అవినీతి రాజకీయాలకి కేరాఫ్ అయిన కొంతమంది నాయకుల‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించే యువకుడిగా ఇందులో కనిపించనున్నాడు.  గోపీ గణేష్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ఈ మూవీ జూన్ 17న రిలీజవుతోంది. ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా నిన్న ఓ పాటను విడుదల చేశారు. ‘రా రమ్మంది ఊరు.. రయ్యంది హుషారు.. రాగమందుకుంది జ్ఞాపకాల జోరు.. పచ్చనైన చేలు, పల్లె పరిసరాలు.. ఎంతకాలమైనా మరువలేదు నా పేరు’ అంటూ సాగే ఈ పాటలో చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నాడు సత్య. స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ని కలుసుకుంటున్నాడు. సునీల్ కశ్యప్ ట్యూన్ చేసిన ఈ సాంగ్‌‌‌‌‌‌‌‌కి రామజోగయ్య శాస్త్రి క్యాచీ  లిరిక్స్‌‌‌‌‌‌‌‌ రాశారు. రామ్ మిరియాల సింగింగ్ హైలైట్‌‌‌‌‌‌‌‌.  ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో  నాగబాబు, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. ఇక సత్యదేవ్  నటించిన ‘గుర్తుందా శీతాకాలం’  రిలీజ్‌‌‌‌‌‌‌‌కి రెడీగా ఉంది. మరోవైపు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, అక్షయ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘రామసేతు’ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు.