కాంగ్రెస్‌ను సొంత ఎమ్మెల్యేలే నమ్మడం లేదు: సత్యవతి రాథోడ్

కాంగ్రెస్‌ను సొంత ఎమ్మెల్యేలే నమ్మడం లేదు: సత్యవతి రాథోడ్

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి తీర్మాన పత్రాన్ని అందించారని అన్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, Mp మాలోతు కవిత, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు..  2/3 మెజార్టీ ప్రకారమే రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీని విలీనం చేయాలని పత్రాన్ని అందజేశారని చెప్పారు.  ఇకపై  12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించబడతారని అన్నారు.  ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించింది లేదని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం కూనీ కాలేదా ? అప్పుడు ఎందుకు నిరసన తెలపలేదని వారు ప్రశ్నించారు.  టీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి ,రాములు నాయక్ ,భూపతి రెడ్డి అలాగే టిడిపి నుంచి  రేవంత్ రెడ్డిని ఎంతకు కొనుగోలు చేశారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్ప్పుడు  ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఇందిరా కాంగ్రెస్ లో ఇండియా కాంగ్రెస్ ను విలీనం చేసిన చరిత్ర మీదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీని సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదు : సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ

కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా మాట్లాడుతున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. కాంగ్రెస్ పార్టీని  ప్రజలే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మడం లేదన్నారు.  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో , శాసన సభాపక్షనేత బట్టి విక్రమార్క నియోజకవర్గంలో మెజార్టీ జడ్పీటీసీ స్థానాలు టిఆర్ఎస్ గెలుచుకుందన్నారు. కాంగ్రెస్ పనికి మాలిన విమర్శలు మానుకొని మిగిలిన ఎమ్మెల్యేలను అయినా  కాపాడుకోవాలని హితవే పలికారు సత్యవతి రాథోడ్.