ఆసియా దేశాలకు క్రూడ్ ధర తగ్గించిన సౌదీ

ఆసియా దేశాలకు క్రూడ్ ధర తగ్గించిన సౌదీ

ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిన క్రమంలో సౌదీ అరేబియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన రెగ్యులర్ కస్టమర్లు అయిన ఆసియా దేశాలకు తగ్గింపును ప్రకటించి అండగా నిలిచింది. సౌదీ నుంచి 60 శాతం ముడి చమురును చైనా, దక్షిణ కొరియా, జపాన్‌, భారత్‌లకు ఎగుమతి అవుతోంది. సౌదీకి చెందిన ఆరామ్‌ కో కంపెనీ నుంచి ఇవి ఎగుమతి అవుతున్నాయి. ఆసియా మార్కెట్లు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ బ్యారెల్‌ ధర ఇపుడు 72 డాలర్లకు చేరువైంది. ఈ పరిస్థితుల్లో  సాధారణ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 1.30 డాలర్లు అలాగే  ప్రీమియం క్రూడ్‌ ధరను 1.7 డాలర్ల మేరకు ఆరామ్‌కో తగ్గించినట్లు సమాచారం. తగ్గింపునిస్తామన్న సౌదీ బ్యారెల్‌కు 60 సెంట్లు వరకు తగ్గిస్తుందని భావించగా భారీ తగ్గింపుతో సౌదీ ప్రపంచ కొనుగోలు దారులకు ఝలక్ ఇచ్చింది.