పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

హైదరాబాద్ :  ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదన్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్. వీటిని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుండడంతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శంకరాపూర్ లోని తెలంగాణ గోల్లూరు ఫారెస్ట్ రెవిన్యూ బ్లాక్ లో మొక్కలు నాటారు రాజ్యసభ సభ్యుడు సంతోష్. ఈ కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసు దేవ్ తో పాటు మంత్రులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. గొల్లూరు ఫారెస్ట్ బ్లాక్ లో 10 వేల మొక్కలు నాటారు నేతలు.

ఈ సందర్భంగా మాట్లాడిన సద్గురు.. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని చెప్పారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం వల్ల నేలతల్లి జీవం కోల్పోంతోందన్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఇది భవిష్యత్ తరాలకు పెనుముప్పుగా పరిణమిస్తుందన్నారు. ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదని.. దాన్ని కాపాడుకోవాల్సన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకు హరితహారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. సేవ్‌ సాయిల్ ఉద్యమాన్ని చేపట్టి.. ప్రపంచ యాత్ర చేస్తున్న సద్గురు హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్తుండగా మార్గ మధ్యలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన ఐదో విడత గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు.