ప్రపంచ మట్టి దినోత్సవం : మార్మోగిన Save soil  నినాదాలు 

ప్రపంచ మట్టి దినోత్సవం : మార్మోగిన Save soil  నినాదాలు 

హైదరాబాద్ :  ఇవాళ ప్రపంచ మట్టి దినోత్సవం. మనమంతా మట్టి మనుషులం. మట్టిలో పెరుగుతాం.. మట్టిలో తిరుగుతాం.. మట్టిలో ఒరుగుతాం!! ఇంతటి విలువైన మట్టి కూడా సంక్షోభ దశను ఎదుర్కొంటోంది. ఇప్పటికే 30 శాతం భూమి క్షీణతకు గురైంది. వచ్చే 30 ఏళ్లలో వ్యవసాయ భూమి తగ్గిపోయి ఆకలి చావులు సంభవించే గండం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో  ప్రపంచ మట్టి దినోత్సవం సందర్భంగా  హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో "మట్టిని రక్షించు" సంస్థ ఆధ్వర్యంలో  పెద్ద సంఖ్యలో వాలంటీర్స్ ప్రజలకు అవగాహన కల్పించారు.

కొత్త పేట విక్టోరియా మెమోరియల్  మెట్రో స్టేషన్ నుంచి దిల్ సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వరకు  వాలంటీర్స్ Save soil  నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ప్రజలకు స్టిక్కర్స్ పంపిణీ చేశారు. మట్టిని రక్షించుకునేందుకు ప్రతిఒక్కరు  ఈ ఉద్యమంలో భాగం కావాలని సేవ్ సాయిల్ ఆర్గనైజింగ్ వాలంటీర్ భార్గవ్ కోరారు. వ్యవసాయ భూములలో సారం క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో కనీసం  వ్యవసాయ భూములలో 3-6%  సేంద్రియ ఎరువులను వాడేలా చట్టాలు రూపొందించాలన్నారు. సద్గురు చేపట్టిన ప్రపంచవ్యాప్త పర్యావరణ ఉద్యమంలో భాగంగా 27 దేశాల్లో 100 రోజులు 30వేల కిలోమీటర్ల మేర మోటర్ సైకిల్ యాత్ర చేపట్టారని గుర్తు చేశారు.