హైదరాబాద్ సిటీలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి

హైదరాబాద్ సిటీలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి
  • విద్యతోనే మహిళల అభ్యున్నతి

సిటీ నెట్​వర్క్, వెలుగు: సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని సిటీలో శనివారం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిలింనగర్​లో నిర్వహించిన వేడుకల్లో మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అంబేద్కర్ వర్సిటీలో వీసీ ఘంటా చక్రపాణి, ఓయూ ఆర్ట్స్ కాలేజీలో విమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. సూరారం ప్రభుత్వ పాఠశాలలో హెల్పింగ్ హర్ట్స్ సోసైటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. 

మహిళల అభివృద్ధి విద్యవల్లనే సాధ్యమవుతుందని పేర్కొని పాఠశాల అభివృద్ధికి రూ.10 వేల విరాళం అందజేశారు. హైదర్‌గూడలోని ఫూలే దంపతుల విగ్రహం వద్ద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, రాంనగర్‌లో తన నివాసంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, పద్మారావునగర్​లో స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సినీ నటుడు గౌతమ్ రాజు నివాళులర్పించారు.