స్టే ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశవ్యాప్తంగా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ మే 19న ప్రారంభమై జూన్ 8న ముగుస్తుంది.
పోస్టు పేరు: అప్రెంటీస్.
మొత్తం ఖాళీలు: 7150. తెలంగాణ రాష్ట్రంలో 491 ఖాళీలు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థి ఇంతకు ముందు ఎస్బీఐలో గానీ లేదా ఇతర సంస్థల్లో గానీ అప్రెంటిస్‌షిప్ చేసి ఉండకూడదు.
డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్షణ లేదా ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు కాదు. ఏదైనా బ్యాంక్/ ఎన్బీఎఫ్సీ/ ఫైనాన్షియల్ సంస్థల్లో ఎలాంటి బకాయిలు చెల్లించడంలో విఫలమై ఉండకూడదు.
వయోపరిమితి (2026, ఏప్రిల్ 1 నాటికి): 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 19.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జూన్ 8.
ఆన్ లైన్ రాత పరీక్ష: 2026, జులై.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.sbi.co.in/careers ను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్ స్టేజ్–I: ఆన్లైన్ టెస్ట్
ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. జనరల్/ ఫైనాన్స్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా ప్రశ్నలు 13 స్థానిక భాషల్లో ఇస్తారు.
స్టేజ్-II: లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
ఆన్లైన్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర లోకల్ లాంగ్వేజ్ టెస్టు ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. కానీ ఇందులో అర్హత సాధించకపోతే తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో రాష్ట్ర స్థానిక భాషలో చదువుకున్న వారికి ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
