గడచిన కొన్నేళ్లుగా యూపీఐ రాకతో డిజిటల్ పేమెంట్స్ పుణ్యమా అని చాలా మందికి తరచుగా ఏటీఎంలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతోంది. యూపీఐ వాడకం ఎంత పెరిగినా ఏటీఎంలను వాడి డబ్బులు డ్రా చేస్తున్న వారి సంఖ్య తగ్గటం లేదు. బ్యాంకులు కూడా చిన్న చిన్న మెుత్తాలు డ్రా చేయాలంటే ఏటీఎంలకే వెళ్లమని కస్టమర్లకు సూచించటంతో వాడి ప్రాముఖ్యత తగ్గటం లేదు. అయితే దీనిని కొందరు మోసగాళ్లు జనం సొమ్ము కాజేయటానికి తెలివిగా వాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లోపల మోసగాళ్లు ఏటీఎం క్యాష్ డిస్పెన్సర్ దగ్గర ఏర్పాటు చేసిన మెటల్ బాక్స్ పోలీసులు గుర్తించారు. అకౌంట్ హోల్డర్ డబ్బు విత్ డ్రా చేయగానే అవి బయటకు రాకుండా ఆ ఇనుప బాక్సు అడ్డుకుంటోంది. పైగా అది మెషిన్ లోని అంతర్బాగం అనుకునేలా అస్సలు డౌట్ రాకుండా ఉంది చూడటానికి. అతికించి ఉంచిన దానిని తీసిన పోలీసులు అందులో డబ్బును గుర్తించారు.
एक बार मेरे साथ भी ऐसी घटना हुई थी, तब से मैं सतर्क रहता हूं और अब लगभग-लगभग मैं कैश का उपयोग 20% करता हूं अमूमन अब 80% ऑनलाइन ही लेनदेन करता हूं ताकि इन झंझटों से बच सकें। pic.twitter.com/N1AXpJzm7A
— Anuj Agnihotri Swatntra (@swatntra_anuj) June 5, 2026
ఇలాంటి మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారి కస్టమర్లకు సూచించారు. అక్కడ డబ్బు పోగొట్టుకున్న కస్టమర్ రూ.10వేలు డ్రా చేయగా అవి బయటకు రాకపోవటం, మోసగాళ్లు ఏర్పాటు చేసిన ఇనుప బాక్సులో అవి ఇరుక్కోవటం వీడియోలో క్లియర్ గా చూపించారు. అయితే నిందితులు ఇక్కడితో ఆగలోదు. ఏటీఎం సెంటరులో ఏర్పాటు చేసిన ఏసీ పక్కన ఒక నల్లటి బాక్సులో మెుబైల్ ఫోన్ దాచి ఉంచారు. డబ్బు రాకపోవటంతో అక్కడి నుంచి కస్టమర్లు వెళ్లిపోయాక వచ్చి ఏటీఎం నుంచి వచ్చిన సొమ్మును ఎంత పకడ్బందీగా నేరగాళ్లు దోచుకుంటున్నారో వీడియోలో చూపించారు సదరు పోలీసు అధికారి.
►ALSO READ | పెట్రోల్, ఎలక్ట్రిక్ లేదా ఫ్లెక్స్-ఫ్యూయల్ ? ఏ కారు బెస్ట్? .. రోడ్ ట్రిప్స్‌కు ఏది సేఫ్ ?
సో హడావిడిలో ఉన్నా కూడా మీరు వెళ్లిన ఏటీఎం లోపల ఏం ఉన్నాయ్ అనేది ఒక్కసారి గమనించండి కస్టమర్స్. ఒకవేళ సాధారణంగా ఏటీఎం కంటే భిన్నంగా ఏవైనా గుర్తిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి ఆ సమాచారాన్ని బ్యాంక్ సిబ్బందికి లేదా కస్టమర్ సర్వీసు వాళ్లకు వెళ్లడించండి. వీలైనంత వరకూ డిజిటల్ రూపంలో చెల్లింపులు చేస్తే ఏటీఎంలకు వెళ్లే అవసరం కూడా రాదు.
