SBIలో 8134 పోస్టులు..

SBIలో 8134 పోస్టులు..

నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్. కస్టమర్స్ సపోర్ట్ , సేల్స్ విభాగంలో 8134 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో జూనియర్ అసోసియేట్స్ 7870 రెగ్యులర్ పోస్టులు కాగా మిగతావి బ్యాక్ లాగ్ పోస్టులు. వీటికి  జనవరి  3 నుంచి 26 వరకు దరఖాస్తు  చేసుకోవచ్చు.  ఇంట్రెస్ట్ ఉండి అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ – https://bank.sbi/web/careers లేదా https://sbi.co.in/web/careers ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు 8134

పోస్టుల కేటాయింపు                           ఖాళీలు

రెగ్యులర్ పోస్టులు                              7,870(ఏపీ-150, తెలంగాణ-375)

బ్యాక్‌లాగ్ పోస్టులు                             134

స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్           130

మొత్తం ఖాళీలు                                  8,134

  • అర్హత ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
  • 01.01.2020 నాటికి 20 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1992 – 01.01.2000 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం ఏజ్ లో కండీషన్స్ ఉంటాయి.
  • అప్లికేషన్ ఫీజు జనరల్, ఓసీ,ఓబీసీ,ఈబీసీ వారికి రూ.750. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు.