ATM నుంచి విత్‌డ్రాయల్‌ పరిమితిని పెంచిన SBI

ATM నుంచి విత్‌డ్రాయల్‌ పరిమితిని పెంచిన SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ATM ల నుంచి రోజువారీ విత్ డ్రా చేసుకునే నగదు పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏడు రకాల డెబిట్ కార్డులపై విత్ డ్రాయల్ లిమిట్ ను పెంచుతున్నామని తెలిపింది. కార్డులను బట్టి రోజుకు రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు ATMల ద్వారా 8 ట్రాన్సాక్షన్ ల వరకు ఉచితంగా చేసుకోవచ్చని… అంతకు మించితే ఛార్జీలు విధిస్తామని తెలిపింది.

మరోవైపు రూ. 10 వేలు అంతకు మించి విత్ డ్రా చేసుకునేటప్పుడు వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు OTP వస్తుందని… ఆ OTPని ATMలో ఎంటర్ చేయాలని SBI తెలిపింది. OTP ఎంటర్ చేయకపోతే… ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పింది. సెప్టెంబర్ 18 నుంచి ఇది అమల్లోకి రానుంది.

డెబిట్ కార్డులు, రోజువారీ విత్ డ్రాయల్స్…

క్లాసిక్ అండ్ మాస్ట్రో డెబిట్ కార్డు: రూ. 20 వేలు

గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 40 వేలు

గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 50 వేలు

ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 1 లక్ష

ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు: రూ. 40 వేలు

ముంబై మెట్రో కాంబో కార్డ్: రూ. 40 వేలు

మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్: రూ. 40 వేలు