వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ

బ్యాంక్ నుంచి లోన్లు తీసుకునేవాళ్లకు ఎస్జీఐ చేదు వార్తనిచ్చింది. మరొకసారి వడ్డీ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీఎల్ ఆర్ (MCLR: Marginal Cost of Funds based Lending Rate) పెరినందువల్ల వడ్డీ రేట్లు 10 బేసిస్‌ పాయింట్లు పెంచినట్లు వెల్లడించింది.  బ్యాంకులు ఇచ్చే కనీస వడ్డీరేటును ఎంసీఎల్‌ఆర్‌ అంటారు. దీంతో హోం లోన్ తీసుకున్నవాళ్లపై అధికభారం పడే అవకాశం ఉంది. 

ఏడాది కాలపరిమితి కలిగిన వడ్డీలపై ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.70 శాతం నుంచి 7.80 శాతానికి చేరుకుంటుంది. నెల, మూడు నెలల వడ్డీ రేటు 8 శాతంగా, 6 నెలల వడ్డీ రేటు 8.3 శాతం ఉంది. రెండేండ్ల కాలపరిమితి ఉన్న వడ్డీలపై ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.5 శాతంగా ఉంచిన బ్యాంక్‌.. మూడేండ్ల వడ్డీ రేటును 8.6 శాతంగా ఉంచింది. పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. కాగా నెల రోజుల వ్యవధిలో ఎస్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి. ఎస్బీఐతో పాటు హెచ్ డీఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు కూడా ఎంసీఎల్‌ఆర్‌ పెంచాయి.