రూ. 5 లక్షల కోట్లు దాటిన ఎస్‌బీఐ హోమ్‌ లోన్ బిజినెస్‌

రూ. 5 లక్షల కోట్లు దాటిన ఎస్‌బీఐ హోమ్‌ లోన్ బిజినెస్‌
  • ఆర్థిక సంవత్సరం 2024 నాటికి
  • రూ. 7 లక్షల కోట్లే టార్గెట్‌‌

ముంబై: బ్యాంక్ హోమ్‌‌ లోన్ బిజినెస్‌‌ రూ. 5 లక్షల కోట్లను దాటిందని స్టేట్‌‌ బ్యాంక్ ఆఫ్‌‌ ఇండియా(ఎస్‌‌బీఐ) బుధవారం ప్రకటించింది. గత పదేళ్లలో బ్యాంక్ రియల్‌‌ ఎస్టేట్‌‌ అండ్ హౌసింగ్‌‌ బిజినెస్‌‌ (ఆర్‌‌‌‌ఈహెచ్‌‌బీయూ) ఐదు రెట్లు పెరిగిందని తెలిపింది. 2011 లో ఎస్‌‌బీఐ అసెట్‌‌ అండర్‌‌‌‌ మేనేజ్‌‌మెంట్‌‌(ఏయూఎం) రూ. 89 వేల కోట్లుగా ఉండగా, 2021 నాటికి రూ. ఐదు లక్షల కోట్లకు పెరిగింది.  బ్యాంక్‌‌పై కస్టమర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఎస్‌‌బీఐ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో పర్సనలైజ్డ్‌‌ సర్వీస్‌‌లను టెక్నాలజీతో కంబైన్ చేయడం అవసరమని ఎస్‌‌బీఐ చైర్మన్‌‌ దినేష్‌‌ ఖారా పేర్కొన్నారు. హోమ్‌‌ లోన్ డెలివరీని మెరుగుపరిచేందుకు ఎస్‌‌బీఐ పనిచేస్తుందని తెలిపారు. దీని కోసం యునిక్ ఇంటిగ్రేటెడ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ రిటైల్‌‌ లోన్ మేనేజ్‌‌మెంట్‌‌ సిస్టమ్‌‌(ఆర్‌‌‌‌ఎల్‌‌ఎంఎస్‌‌)ను బ్యాంక్‌‌ డెవలప్ చేస్తోందని చెప్పారు. ఇది కస్టమర్లకు ఎండ్‌‌ టూ ఎండ్‌‌ డిజిటల్ సొల్యూషన్స్‌‌ను అందిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి బ్యాంక్ హోమ్‌‌ లోన్ బిజినెస్‌‌ సైజును రూ. 7 లక్షల కోట్లకు పెంచాలని ఎస్‌‌బీఐ టార్గెట్‌‌గా పెట్టుకుంది.  ఇండియన్ హోమ్‌‌ లోన్ మార్కెట్లో బ్యాంక్ వాటా 34 శాతంగా ఉంది. 2004 లో హోమ్‌‌ లోన్‌‌ బిజినెస్‌‌లోకి ఎంటర్ అయిన స్టేట్‌‌బ్యాంక్‌‌, ఈ బిజినెస్‌‌ను 2012 లో సపరేట్ చేసింది.

For More News..

ఇండియా ఫుట్‌బాల్‌ టీమ్‌లో తెలంగాణ యువతి

త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ షెడ్యూల్!

కేసీఆర్ కుటుంబీకులు రూ. 25 లక్షల జీతం తీసుకుంటున్నరు