35 శాతం తగ్గిన SBI నికర లాభం..

35 శాతం తగ్గిన SBI నికర లాభం..

దేశంలోనే అతిపెద్ద రుణదాత బ్యాంక్ ఎస్బీఐ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఎస్బీఐ డిసెంబర్ త్రైమాసికానికి నికర లాభం 35 శాతం పడిపోయి రూ. 9,164 కోట్లకు చేరుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గత ఏడాది ఇదే సమయంలో రూ. 14,205 కోట్ల నికర లాభాన్ని పొందింది.బ్యాంకు మొత్తం ఆదాయం ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్  మూడో త్రైమాసికంలో రూ. 1,18,193 కోట్లకు పెరిగిందని.. ఇది గతేడాది ఇదే కాలంలో రూ. 98,084 కోట్లుగా ఉందని బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ రూ. 1,06, 734 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సంపాదించింది. అంతకుముందు 2023లో ఇదే కాలంలో రూ. 86,616 కోట్లుగా ఉంది.  

బ్యాంకు స్థూల నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్స్ (NPA) గతేడాది (2023)  మూడో త్రైమాసికం చివరి నాటికి 3.14 శాతం నుంచి డిసెంబర్ చివరి నాటికి 2.42 శాతానికి తగ్గింది. నికర నిరర్థక ఆస్తులు(NPA) కూడా ఏడాది క్రితం ఇదే కాలం ముగింపులో 0.77 శాతం నుంచి 0.64 శాతానికి తగ్గాయి.కన్సాలిడేటెడ్  ప్రకారం.. ఎస్ బీఐ గ్రూప్ నికర లాభం 29 శాతం క్షీణించి రూ. 11,064 కోట్లకు పడిపోయింది. 2023 ఇదే త్రైమాసికంలో రూ. 15,477 కోట్లుగా ఉంది. అయితే గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 1,27,219 కోట్లతో పోలిస్తే ఆదాయంరూ. 1,53,072 కోట్లకు పెరిగింది.