సబ్ ప్లాన్ నిధులను వినియోగించాలి : బక్కి వెంకటయ్య

సబ్ ప్లాన్ నిధులను వినియోగించాలి :  బక్కి వెంకటయ్య
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య 

నిజామాబాద్, వెలుగు : దళిత, గిరిజన వర్గాల అభివృద్ధి కోసం కేటాయించిన సబ్​ప్లాన్​ నిధులను పూర్తిగా వినియోగించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్​ బక్కి వెంకటయ్య ప్రభుత్వాన్ని కోరారు. శనివారం కలెక్టరేట్​లో ఆయన రివ్యూ మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ యూత్​కు స్వయం ఉపాధి స్కీములు మంజూరు చేయడానికి కొర్రీలు పెట్టొద్దన్నారు. కులసంఘాల నేతల సమక్షంలో అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించారు. 

కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య తదితరులు ఉన్నారు. అంతకు ముందు నందిపేట మండలం కేంద్రంలోని ప్రసిద్ధ కేదారీశ్వర ఆశ్రమాన్ని విజిట్​ చేసి ఆశ్రమ స్థాపకుడు మంగి రాములు మహరాజ్​ ఆశీర్వాదాలు పొందారు.

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శ

రౌడీ షీటర్​ సయ్యద్​ రియాజ్​ చేతిలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్​ ప్రమోద్​కుమార్ కుటుంబీకులను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్​ బక్కి వెంకటయ్య శనివారం పరామర్శించారు. కమిషన్​ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

దళిత మహిళకు పరిహారం అందేలా చూడాలి 

కామారెడ్డిటౌన్ : ఇటీవల పాల్వంచ మండలం ఫరీద్​పేటలో లైంగికిదాడికి గురైన దళిత మహిళకు తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్​ బక్కి వెంకటయ్య అడిషనల్​ కలెక్టర్​ మదన్మోహన్​కు సూచించారు. శనివారం కామారెడ్డి ఆర్​అండ్​బీ గెస్టు హౌజ్​లో బాధితురాలిని పరామర్శించి మాట్లాడారు. 

బీహార్​కు చెందిన నిందితుడిని పట్టుకోవటంలో చొరవ తీసుకున్న ఏఎస్పీ చైతన్యారెడ్డి,  కామారెడ్డి రూరల్ సీఐ రామన్​ను ఆయన సన్మానించారు. ఆయన వెంట అంబేడ్కర్, ఎస్సీ సంఘాల ప్రతినిధులు బట్టెంకి బాల్​రాజు,  తమ్మడి స్వామి, రాజు, బట్ట వెంకటరాములు, కొత్తపల్లి మల్లయ్య , చిట్యాల సాయిలు ఉన్నారు.