అక్రమంగా ఎస్సీ సర్టిఫికెట్ పొంది ఎన్నికల్లో పోటీ..ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎస్సీ కులస్తుల నిరసన

అక్రమంగా ఎస్సీ సర్టిఫికెట్ పొంది ఎన్నికల్లో పోటీ..ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎస్సీ కులస్తుల నిరసన

సిద్దిపేట రూరల్, వెలుగు: అక్రమంగా ఎస్సీ కులం సర్టిఫికెట్ పొంది, ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామ ఎస్సీ కులస్తులు ఆందోళన చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని బీసీ కులానికి చెందిన కొందరు వ్యక్తులు, మాదిగ ఉప కులస్తులుగా చెప్పుకుని తప్పుడు ఆధారాలు చూపి, ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందారని ఆరోపించారు.  వాటిని అడ్డు పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేశారన్నారు.

 గతంలో వారు బీసీ కులస్తులుగా చెప్పుకుని, బీసీ స్థానాలకు పోటీ చేశారన్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ వర్గం ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవయ్య, కనకయ్య, చిన్న దేవయ్య, అశోక్, నర్సయ్య, నర్సింలు, సుమన్, లక్ష్మీ, సాయవ్వ, పుష్పలత, లత, ఎల్లవ్వ, ప్రమీల, లక్ష్మి పాల్గొన్నారు..