ఎస్సీ వర్గీకరణ తప్పుల తడకగా జరిగింది: చిత్తూరు మాజీ ఎంపి రెడ్డప్ప

ఎస్సీ వర్గీకరణ తప్పుల తడకగా జరిగింది: చిత్తూరు మాజీ ఎంపి రెడ్డప్ప

ఎస్సీ వర్గీకరణ తప్పుల తడకగా జరిగిందని చిత్తూరు మాజీ ఎంపి రెడ్డప్ప మండిపడ్డారు. వర్గీకరణ వలన పిల్లల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో నిర్వహించిన ‘మాలల ఆత్మీయ సభ’లో పాల్గొన్న రెడ్డప్ప.. మాలలు హక్కుల కోసం ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. వర్గీకరణ పేరుతో దళితుల మధ్య ఐక్యత దెబ్బతీసేందుకు కుట్రలు పన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం జరిగితే సహించేది లేదని మాజీ ఎంపీ రెడ్డప్ప అన్నారు.  

 దళితుల కోసం కొట్లాడిన వారిలో అంబేద్కర్ తరువాత కాకా వెంకట స్వామి గుర్తుకు వస్తారని అభిప్రాయపడ్డారు. వివేక్ విద్యావేత్త, వ్యాపార వేత్త అని.. రాజకీయాలలో నిస్వార్థ సేవాపరుడు అని కొనియాడారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా ఉన్న నేత వివేక్ వెంకట స్వామి అని ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. 

తిరుపతి మాలల సభకు ముఖ్య  అతిథిగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మాలలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని సూచించారు. పోరాటాలతోనే హక్కులు సాధించవచ్చునని, అందుకు అంబేద్కరే ఆదర్శమని అన్నారు.