ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ: గుజరాత్ లో ఇద్దరు బాలికలపై రే ప్ కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టి వేసింది. కేసు విచారణ కొనసాగుతోందని, 210 మంది సాక్షులను విచారిం చాల్సి ఉందని గుజరాత్ సర్కారు తరఫున సాలిసిటర్ జనర్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ ను తిరస్కరిం చిన జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యం లోని బెం చ్.. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడిం దని,ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగుతుందని చెప్పింది. తమపై అత్యాచారానికి పాల్పడినట్లు సూరత్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆశారాం బాపు, ఆయన కొడుకు నారాయణన్ సాయి పై వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.