సీఎం అనుమతి లేకుండా మంత్రిని తొలగించలేం

సీఎం అనుమతి లేకుండా మంత్రిని తొలగించలేం
  • సెంథిల్​ బాలాజీ కేసులో సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ :  తమిళనాడు మంత్రి వి.సెంథిల్​బాలాజీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓ కేసులో అరెస్ట్​ అయిన మంత్రిని సీఎం అనుమతి లేకుండా తొలగించలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఆయనను తొలగించాలంటూ ఓ సామాజిక కార్యకర్త చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈమేరకు గతంలో మద్రాస్ ​హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సుప్రీం ఏకీభవించింది.

‘‘ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌‌‌‌‌‌‌‌కు ఉందా లేదా అనే విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. సంబంధిత వ్యక్తి మంత్రిగా కొనసాగాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను ముఖ్యమంత్రికి వదిలివేస్తుంది’’ అని జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకాతో కూడిన సుప్రీం బెంచ్​ శుక్రవారం తీర్పు వెలువరించింది.