హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్ల భర్తీకి నిర్వహించనున్న ఎంట్రన్స్‌కు అధికారులు హాల్ టికెట్లు రిలీజ్ చేశారు. ఈ నెల 15న పరీక్ష జరగనుండగా.. మంగళవారం నుంచి ఈనెల 14 వరకు హాల్ టికెట్లను http://rjcet.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సోమవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
2026–27 అకడమిక్ ఇయర్లో సీవోఈలు, రెగ్యులర్ జూనియర్ కాలేజీలు , సైనిక్ కాలేజీలు, ఒకేషనల్ కాలేజీలు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ (బాలికలు) లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు ఈనెల 15న ఎంట్రన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 231 కాలేజీలు ఉండగా ఇందులో సుమారు 19 వేల సీట్లు ఉన్నాయి. పూర్తి వివరాల కొరకుhttp://rjcet.telangana.gov.in వెబ్‌సైట్‌చూడాలని అధికారులు సూచించారు.
