
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల స్టూడెంట్ల కోసం 'ఉన్నతి' పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి వెల్లడించారు. దీని కోసం బెంగళూరుకు చెందిన 'ఉన్నతి ఫౌండేషన్' తో ఎస్సీ గురుకుల సొసైటీ ఎంవోయూ చేసుకున్నట్లు తెలిపారు. కోడింగ్, జాబ్ ఓరియెంటేషన్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ , ఈట్ రైట్ స్కూల్ సర్టిఫికేషన్ వంటి నాలుగు ప్రోగ్రాములు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. మంగళవారం ఆమె మసాబ్ ట్యాంక్ డీసీసీ భవన్ లోని సొసైటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. " విద్యార్థులను ఎంప్లాయ్ మెంట్ సీకర్స్, జాబ్ ప్రొవైడింగ్చేయాలన్న ఆలోచనతో వారికిఉన్నతి ఫోగ్రామ్కింద ట్రైనింగ్ఇవ్వాలని నిర్ణయించాం.
రాష్ట్ర వ్యాప్తంగా 238 గురుకులాల్లో ట్రైనింగ్ఇవ్వనున్నాం. ఒక్క బ్యాచ్ 40 మందితో 45 రోజులు ట్రైనింగ్ కొనసాగుతుంది. జూన్ మూడో వారం నుంచి శిక్షణ మొదలు పెడుతాం. ఇందుకోసం గ్రామం, పట్టణాలలోని స్టూడెంట్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి" అని అలుగు వర్షిణి కోరారు. త్వరగా ఉద్యోగాలు వస్తే ఎర్లీ మ్యారేజేస్, డోమాస్టిక్ వాయిలెన్స్, ఆన్ఎంప్లాయ్మెంట్ సమస్యలు, డ్రగ్ఎడిక్షన్వంటి ఇష్యూస్ నుంచి స్టూడెంట్లు బయటపడుతారని చెప్పారు.