రద్దయిన చట్టం కింద కేసులా?.కేంద్రానికి సుప్రీం నోటీసులు

రద్దయిన చట్టం కింద కేసులా?.కేంద్రానికి సుప్రీం నోటీసులు

లేని చట్టం కింద కేసులు నమోదు చేయడంపై కేంద్రానికి నోటీసులిచ్చింది సుప్రీంకోర్టు. ఆరేళ్ల కిందటే రద్దయిన 66A చట్టం కింద పోలీసులు ఇంకా కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకునేందుకు గతంలో 66A యాక్ట్ తెచ్చారు. ఈ యాక్ట్ కింద నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష కూడా ఉంది. అయితే ఈ చట్టాన్ని సుప్రీం కోర్టు 2015లోనే రద్దు చేసింది. అయినా కూడా ఇప్పటికీ పోలీసులు 66A చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యికి పైగా కేసులు నమోదు చేశారు. దీనిపై ఓ NGO సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం... వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.