ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

బషీర్​బాగ్​, వెలుగు: బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతానికి రిజర్వేషన్లు పెంచినట్లుగానే ఎస్సీలకు 18 శాతానికి పెంచాలని  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. బొజ్జా తారకం ట్రస్ట్, డాక్టర్​ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో హైకోర్టు మాజీ జడ్జి బొజ్జా తారకం 9వ వర్ధంతి సభ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొజ్జా తారకం దళితుల హక్కుల సాధనకు, న్యాయం కోసం ఆనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్​ కె.లింగయ్య, ప్రధాన కార్యదర్శి గనుమల జ్ఞానేశ్వర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్​పర్సన్ వెన్నెల గద్దర్, నందిగం కృష్ణారావు, చిక్కుడు ప్రభాకర్  పాల్గొన్నారు.