ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువే లేకుండా పోతోంది. స్వార్థం కోసం సొంతవారిని కడతేర్చేందుకు కూడా వెనకాడనివారు కొందరైతే... వ్యామోహం వావి వరుసలు లేకుండా వ్యవహరిస్తున్నారు మరికొంతమంది. ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రబుద్దుడు ఏకంగా పిల్లనిచ్చిన అత్తని ప్రేమించి పెళ్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నేటి సమాజంలో దిగజారిపోతున్న విలువలు, మానవ సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఘటన. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని అక్బర్ పూర్ లో జరిగిన ఈ విచిత్ర ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్బర్ పూర్ కి చెందిన ఓ వ్యక్తి అత్తగారి అందానికి ముగ్దుడై ఆమెనే పెళ్లాడాడు. కూతురితో పెళ్లి తర్వాత అత్తగారింటికి రాకపోకలు సాగించిన అల్లుడు.. ఏకంగా అత్తతో ప్రేమలో పడ్డాడు.
Love has no limits: Man marries mother-in-law after 4-year affair, shares wedding video | WATCH
— Pranav (@SanataniiPranav) June 8, 2026
Shared via TheTatva Apphttps://t.co/UtqgEjY5iH pic.twitter.com/5HavDRLv0T
ఇద్దరి మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ లోకం ఏమనుకున్నా పర్వాలేదంటూ ఇళ్లనుంచి పారిపోయి మరీ కోర్టులో వివాహం చేసుకున్నారు ఈ ఆదర్శ ప్రేమికులు. అక్కడితో ఆగకుండా తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని.. కోర్టు సర్టిఫికెట్ తో పూలదండలు మార్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఈ క్రమంలో విచిత్ర పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తమ బంధాన్ని సమాజం అంగీకరించి, ఆశీర్వదించాలని కోరుతున్నారు ఈ ఆదర్శ జంట.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు నెటిజన్స్ నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఇది విచిత్ర ప్రేమ మాత్రమే కాదు.. ఒక కుటుంబాన్నే విచ్ఛిన్నం చేసిన సంఘటన అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వావి వరస లేకుండా... పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి ఏంటి... పోయే కాలం కాకపోతే.. అంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. తల్లి సమానమైన అత్తను పెళ్లి చేసుకోవడమా ఇంతకన్నా దౌర్బాగ్యం ఉండదు.. యుగాంతానికి ఇలాంటి ఘటనలే సంకేతామంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.
