బెస్ట్ అవైలబుల్ స్కూల్​ స్కీం కింద దరఖాస్తుల ఆహ్వానం

బెస్ట్ అవైలబుల్ స్కూల్​ స్కీం కింద దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు​ : 2025-26 విద్యా సంవత్సరానికి గానూ బెస్ట్ అవైలబుల్ (రెసిడెన్షియల్) స్కీం కింద 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశం పొందేందుకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల  నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకుడు కస్తాల సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

 డే స్కాలర్ కింద 1వ తరగతిలో 128 సీట్లు, రెసిడెన్షియల్ స్కీం కింద 5వ తరగతిలో 131 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు.  ఆసక్తిగల విద్యార్థులు జూన్ 2 నుంచి 16 లోపు దరఖాస్తు ఫారంను ఖమ్మంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుడి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.