
హైదరాబాద్, వెలుగు: ఏప్రిల్ 24న మొదలైన వేసవి సెలవులు మంగళవారంతో ముగిశాయి. బుధవారం నుంచి గ్రేటర్పరిధిలోని స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. సిటీ వ్యాప్తంగా 7,587 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్స్కూళ్లు ఉన్నాయి. మొదటి రోజు స్టూడెంట్స్కు స్వాగతం పలికేందుకు యాజమాన్యాలు స్కూళ్లను ముస్తాబు చేశాయి. పలు స్కూళ్లలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
ఉయం 9:30 గంటలకు అబిడ్స్ జీఎంహెచ్ఎస్ లో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొంటారు. స్టూడెంట్లకు బుక్స్, యూనిఫామ్, షూ అందజేస్తారు. హైదరాబాద్ జిల్లాలో15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, సెగ్మెంట్ కు 3 ప్రభుత్వ స్కూళ్ల చొప్పున ఎంపిక చేసి అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొని బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేయనున్నారు.