
మెదక్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికొలస్ ఆదివారం మెదక్ చర్చిని సందర్శించారు. చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య ఆయనకు చర్చి చరిత్రను వివరించారు. చర్చి కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేసే పీఈటీ, పీడీలు మర్యాద పూర్వకంగా ఆయనను కలిశారు.
పీడీ అసోసియేషన్ నాయకుడు నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని కస్తూర్బా గాంధీ స్కూళ్లు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో స్పోర్ట్స్ అకాడమీలను నెలకొల్పాలని కోరారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు శ్రీనివాసరావు, మాధవరెడ్డి, రవి, రూపేందర్, మహిపాల్, మనోహర్, లక్ష్మణ్, ప్రభాకర్, హరీశ్, ప్రదీప్, శంకర్ పాల్గొన్నారు.