
హైదరాబాద్, వెలుగు: వచ్చేనెల 6 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) నేషనల్ లెవెల్ టోర్నమెంట్లు ప్రారంభం కానున్నాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. మంగళవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో ఎస్జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీల సమావేశం జరిగింది. అండర్14,17,19 సంవత్సరాల కేటగిరీల్లో వివిధ క్రీడల టోర్నమెంట్లపై చర్చించారు.
నవీన్ నికోలస్ మాట్లాడుతూ... ఇప్పటికే మండల స్థాయి క్రీడాపోటీలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిపోయిన మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలను రెండోవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నాల్గోవారం నాటికి రాష్ట్ర స్థాయి పోటీలు పూర్తి చేయాలని సూచించారు.