కరోనా ఎఫెక్ట్: స్కూల్ సిలబస్ లో 30% తగ్గింపు

కరోనా ఎఫెక్ట్: స్కూల్ సిలబస్ లో 30% తగ్గింపు

ప్లాన్లు రెడీ చేస్తున్న ఎస్సీఈఆర్టీ
సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, టీచర్స్ నుంచి వివరాల సేకరణ
సర్కారు ఆదేశాలు రాగానే రిపోర్టు సబ్మిట్
ఫస్ట్ నుంచి టెన్త్ వరకు పలు పాఠాలు తొలగించే యోచన

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో అకడమిక్ ఇయర్ ఆగమైంది. జూన్లో ఓపెన్ కావాల్సిన స్కూళ్లు.. ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే స్కూల్ వర్కింగ్ డేస్ తగ్గుతున్నాయి. దీంతో దానికి అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో సిలబస్ తగ్గించేందుకు కసరత్తు మొదలైంది.

వర్కింగ్ డేస్ కు అనుగుణంగా..
ఇప్పటికే జాతీయ స్థాయిలోని సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ సిలబస్ ను 25 శాతం నుంచి 30 శాతం తగ్గించనున్నట్టు ప్రకటించాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కూడా.. పనిదినాలు తగ్గాయి కాబట్టి సిలబస్ తగ్గించుకోవచ్చని రాష్ర్టాలకు సూచించింది. దీంతో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అలర్ట్ అయింది. ఏఏ సబ్జెక్టులో ఎంతెంత సిలబస్ తగ్గించవచ్చనే అంశాలపై ఆలోచనలు మొదలుపెట్టింది. వర్కింగ్ డేస్ కు అనుగుణంగా సిలబస్ ను తగ్గించాలని భావిస్తోంది. అయితే సర్కారు నుంచి సిలబస్ తగ్గింపుపై ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెప్తున్నారు.

రాష్ర్టంలో ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు సుమారు 58 లక్షల మందికి పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. అన్ని తరగతులకు ప్రభుత్వం, విద్యాశాఖ సూచనలతో ఎస్సీఈఆర్టీనే సిలబస్ ను రూపొందిస్తుంది. సబ్జెక్టు ఎక్స్ పర్స్ట్, సీనియర్ టీచర్లతో మాట్లాడి, ఏఏ పాఠాలు తొలగించవచ్చనే అంశాలను పరిశీలించాలని ఎస్సీఈఆర్టీ ఉన్నతాధికారులు సబ్జెక్టు ఇన్చార్జీలకు సూచించినట్టు తెలిసింది. ప్రతి సబ్జెక్టులో 30 శాతం వరకు కోత పెట్టేందుకు ప్లాన్లు రెడీ చేసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన రిపోర్టును ఎస్సీఈఆర్టీనే ముందుగా ప్రభుత్వానికి ఇవ్వకుండా, సర్కారు అడిగితేనే ఇవ్వాలని ఆ శాఖ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క ఏపీలోనూ 30 శాతం సిలబస్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు వారు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారనేదీ తెలంగాణ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ర్టంలోని టెక్స్ట్ బుక్స్ ప్రింట్ అయ్యాయి. సర్కారు ఎంత సెలబస్ తగ్గించమంటే, అంతమేరకు పాఠాలను బోధించవద్దని, వాటిలో నుంచి ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఇవ్వద్దనే ఆదేశాలు హెడ్మాస్టరకు ఇవ్వనున్నట్టు ఓ ఉన్నతాధికారి చెప్పారు.

For More News..

జిల్లాలపైనా కరోనా పంజా!