ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులా? ...ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి అన్వర్

ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులా? ...ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి అన్వర్

మేడిపల్లి, వెలుగు: ఫీజు బకాయిలు ఇవ్వమని అడిగినందుకు విద్యాసంస్థల యాజమాన్యాలపై ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేయించడం తగదని ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఎండీ.అన్వర్​ అన్నారు.

 ఫీజు బకాయిల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అన్వర్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు నవంబర్ 3 నుండి నిరవధిక బంద్ చేస్తామని ప్రకటిస్తే, ప్రభుత్వం ఫీజు బకాయిల నిధులు దుర్వినియోగంపై విజిలెన్స్ దాడులకు దిగడం బ్లాక్​మెయిల్​ చేయడమేనన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేశాక తనిఖీలు నిర్వహించాలని కోరారు. హరీశ్​, అరవింద్, సందీప్, వికారం, సాయి, శ్రీకాంత్  పాల్గొన్నారు. 

రీయింబర్స్​మెంట్​ వెంటనే విడుదల చేయాలి

కూకట్​పల్లి: విద్యార్థుల ఫీజు రీయింబర్స్​మెంట్​ వెంటనే రిలీజ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ సో మవారం జేఎన్​టీయూలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్​ నిర్వహించారు. తరగతులను బహిష్కరించారు. అనంతరం వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు అంబటి విశ్వజ్ఞతేజ, ఎరవెల్లి జగన్​, భానుప్రకాశ్​నాయక్​ మాట్లాడుతూ.. రీయింబర్స్​మెంట్​ ఆలస్యం చేయడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అన్నారు.