హైదరాబాద్: సైబరాబాద్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్, కో లివింగ్లపై SOT పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తులతో పాటు డ్రగ్స్ విక్రేతలను SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు నుంచి 6 లక్షల 51 వేల విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్ 31.2 గ్రాములు, 3 గ్రాముల గంజాయితో పాటు మొబైల్ ఫోన్లు, 2 బైకులు, డాంగిల్స్, జీపీఎస్ కార్డు రీడర్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ సరఫరా చేసే నైజీరియా దేశస్తుడు పరారీలో ఉన్నాడు. నిందితులలో ఐటీ ఉద్యోగులు, ఆర్కిటెక్టులు, డ్రైవర్లు, డీజే ప్లేయర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
* గచ్చిబౌలిలో మరో సారి డ్రగ్స్ పార్టీ భగ్నం
* కో లివింగ్ గెస్ట్ రూమ్లో జరుగుతున్న డ్రగ్ పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టివేత
* డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేసిన SOT
* కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న స్మగ్లర్ అరెస్ట్
* డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్ అరెస్ట్
* డ్రగ్స్ పార్టీలో MDMAతో పాటు గంజాయి స్వాధీనం
* ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్తో పాటు ఆరుగురు కన్జ్యూమర్స్ అరెస్ట్
* గుత్తా తేజ కృష్ణ, సాజీర్, వెన్నెల రవి కిరణ్ ,మన్నే ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్డి, అరెస్ట్
* పకనాటి లోకేష్ రెడ్డి, పృథ్వి విష్ణువర్ధన్, కార్ల పొడి వెస్లీ సుజిత్, గుండబోయిన నాగార్జున అరెస్ట్
* మేకల గౌతం, గుంటక సతీష్ రెడ్డిలను అరెస్టు చేసిన SOT
