ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ డ్రాగన్ డబుల్ ట్రీట్..

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ డ్రాగన్ డబుల్ ట్రీట్..

ఎన్టీఆర్ హీరోగా  ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌‌‌లో  ఓ  క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతోన్న  ఈ మూవీ షూటింగ్  శరవేగంగా జరుగుతోంది.  తాజాగా ఈ మూవీపై ఇంటరెస్టింగ్ న్యూస్‌‌‌‌ ఒకటి  చక్కర్లు కొడుతోంది.  ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే టాక్ వినిపిస్తోంది.  

ఇప్పటి ట్రెండ్‌‌‌‌కు తగ్గట్టుగానే, అలాగే ఈ కథకు ఎక్కువ స్పాన్ ఉండటంతో రెండు పార్ట్స్‌‌‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.  దర్శకుడు  ప్రశాంత్ నీల్ తన కథలను ఇప్పటికే  రెండు భాగాలుగా చూపించడంతో  ఈ సినిమాకు కూడా సెకండ్ పార్ట్ కచ్చితంగా ఉంటుందనే బలంగా నమ్ముతున్నారు అభిమానులు. 

ప్రస్తుతం ఈ మూవీ టీమ్ అంతా ఫారిన్ షెడ్యూల్‌‌‌‌కు రెడీ అవుతున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  టోవినోథామస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ఎన్టీఆర్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 31వ చిత్రం.  ‘డ్రాగన్‌‌‌‌’ అనే వర్కింగ్  టైటిల్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్‌‌‌‌‌‌‌‌తో కనిపించనున్నాడు.  

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌‌‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.