ఫీజుల పెంపుపై పేరెంట్స్ గుస్సా

ఫీజుల పెంపుపై పేరెంట్స్ గుస్సా

ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టాను సారంగా ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపెడుతున్నాయి. ఫీజుల పెం పుపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలల ముందు ధర్నాలు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. 2016లో ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు ఇష్టాను సారంగా ఫీజులు పెంచకుండా కట్టడి చేసేందుకు ప్రొఫెసర్‍ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏడాది పాటు పలు పాఠశాలలను సందర్శించి కనీస ఫీజులను సూచిస్తూ 2017లో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇందులో ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏటా వేతనాలు పెంచేందుకు వీలుగా, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులను సమీకరించేందుకు ఫీజులను ఏటా పాఠశాల స్థాయిని, అవసరాలను బేరీజూ వేసుకొని ఫీజులను పెంచేందుకు అవకాశం కల్పించారు. ఇవి కూడా టోటల్‍ ఫీజులో 10-–12 శాతం మించకూడదంటూ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ మీటింగ్ లో ఫీజులను పెంచేందుకు గల కారణాలపై చర్చిం చి ఇరువురికి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని పాఠశాల మేనేజ్ మెంట్‍ తీసుకోవాలని ప్రొఫెసర్‍ తిరుపతిరావు కమిటీ స్పష్టం చేసింది.

పాఠశాల స్థాయిలో ఫీజుల కమిటీ ఏర్పాటు చేసి ఏటా ఫీజులపై పర్యవేక్షణ చేయాలంటూ పలు సూచనలను తిరుపతిరావు కమిటీ నివేదికలో పొందుపరిచారు. అడిట్ లెక్కలు తారుమారు ప్రైవేటు స్కూల్స్ లో ఫీజుల కట్టడికి ప్రభుత్వం జీఓ 1ని విడుదల చేసింది. దీని ప్రకారం డొనేషన్లు, అడ్మిషన్‌ ఫీజులు ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థుల నుంచి తీసుకునే ఫీజుల్లో కూడా టీచర్ల జీతాలకు 55 శాతం, మౌలిక వసతుల కల్పనకు 15 శాతం.. ఇలా విభాగాల వారీగా కేటాయింపులు జరపాలి. ఆయా ప్రైవేట్ స్కూల్‍ మేనేజ్ మెంట్‍ లాభాలు ఎట్టి పరిస్థితుల్లోనూ 5 శాతం మించకూడదు. వీటిని పలు ప్రైవేటు పాఠశాలలు పట్టించుకున్న దాఖలాలు కన్పించడం లేదు. కొన్నింటి కి పేరెంట్స్ కమిటీలు కూడా కాగితాలకే పరిమితం అయినట్లు సమాచారం. డిస్ట్రిక్ట్ ఎడ్యు కేషన్‍ డిపార్ట్ మెంట్ కు సమర్పించే లెక్కలు, వాస్తవ లెక్కలకు పొంతన లేకుండా ఆడిట్‍ లెక్కలను సైతం తారుమారు చేస్తున్నట్లు విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

తరగతి మారితే ఫీజులు బాదుడే..

జిల్లాలో దాదాపుగా 2529 స్కూల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో సుమారు 15శాతం ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించే స్కూల్స్ ఉన్నాయి. స్టేట్‍ సిలబస్ బోధించే ప్రైవేట్‍ పాఠశాలలో ప్రైమరీ ఫీజులు రూ.15 వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అదే సెం ట్రల్ సిలబస్ పాఠశాలలో రూ.30–40 వేలుగా ప్రారంభ ఫీజులు ఉన్నాయి. 1–10 తరగతుల వరకు సెక్షన్ల వారీగా టర్మ్ ఫీజలను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అకడమిక్‍ ఇయర్‍ ప్రారంభం కాకుండానే కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు తరువాతి తరగతులకు ఇప్పుడే ఫీజులు కట్టించుకుంటున్నాయి. ప్రతి తరగతికి ప్రత్యేకంగా ఫీజులను వసూలు చేస్తున్నారు. ఏటా తరగతి మారినప్పుడల్లా 15–30 శాతం మేర ఫీజులను పెంచుతూ పోతున్నారు.

ప్రైమరీ లెవల్ లో ఫీజులు తక్కు వగా ఉన్నందునా విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని పెరిగిన ఫీజుల భారం మోసేందుకు పేరెంట్స్ ముందుకవచ్చినా.. మిడిల్‍, హై క్లాస్ లకు వచ్చేసరికి ఇవి పేరెంట్స్ కు భారం అవుతున్నాయి. రకరకాల పేర్లతో ఫీజు వసూలు కొత్తగా తరగతులు నిర్మిస్తున్నామని.. నూతన బిల్డింగ్ కడుతున్నామని ఇలా వివిధ పేర్లతో అదనంగా వసూలు చేస్తున్నారు. పేరెంట్స్ కు ముందస్తు సమాచారం లేకుండా కనీసం పేరెంట్స్ మీటింగ్ లో చర్చించకుండా ఇలా ఫీజులను ఏకపక్షంగా నిర్ణయించి కట్టాలనడం ఏ విధంగా సమంజసం అని పేరెంట్స్ వాపోతున్నారు. దీనికి తోడూ పుస్తకాలు, యూనిఫాం , బూట్లు అన్ని అక్కడే కొనేలా పేరెంట్స్ ను బలవంతం చేస్తున్నారు. విద్యార్థులకు ట్రాన్స్ పోర్టు కల్పిస్తున్నామని భారీగా వసూల్లకు పాల్పడుతున్నారు. ఐఐటీ, మెడిసిన్‌ కోసం స్పెషల్‍ కోచింగ్‍ ఉంటుం దంటూ అదనంగా రాబడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు స్కూల్స్ ఏటా ఫీజులు పెంచాలని, ఇష్టానుసారంగా ఫీజులు పెంచిన పాఠశాలలపై పేరెంట్స్ పూర్తి ఆధారాలతో విద్యాశాఖకు ఫిర్యా దు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఈఓ వెంకటనర్సమ్మ పేర్కొన్నారు.