దసరానే కాదు.. క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ

దసరానే కాదు.. క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ

అక్టోబర్ నెల వచ్చేసింది. దసరా, బతుకమ్మలతో సగం నెల సెలవులు ఇచ్చేసింది తెలంగాణ సర్కార్. 13 రోజుల దసరా సెలవుల ప్రకటనతో.. ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలకు హాలిడేస్ ఇవ్వటంతోపాటు.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగతా పండుగల సెలవులను కూడా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

ఇందులో భాగంగా దసరా తర్వాత వచ్చే దీపావళికి ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చిన ప్రభుత్వం.. డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ సెలవులను ఐదు రోజులు ఇచ్చింది. మిషనరీ స్కూల్స్ కు మాత్రమే ఐదు రోజుల హాలిడేస్ ఇచ్చిన ప్రభుత్వం.. మిషనరీస్ కాకుండా ఉండే స్కూల్స్, కాలేజీలకు మాత్రం ఒక్క రోజు సెలవు ప్రకటించింది.

ALSO READ : నటి శ్రీదేవి ఆకలితో ఏడ్చేది.. మలమల మాడేది.. : భర్త బోనీకపూర్

ఇక వచ్చే ఏడాది.. అంటే ఈ విద్యా సంవత్సరంలోనే వచ్చే మరో పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుక్కి తెలంగాణ ప్రభుత్వం ఆరు రోజుల సెలవులు ఇచ్చింది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో కలిపి.. మొత్తం ఆరు రోజుల సెలవు ఇవ్వాలని నిర్ణయించింది.