కరోనా కంట్రోల్‌ అయ్యాకే ఢిల్లీలో స్కూల్స్‌ తెరిచేది

కరోనా కంట్రోల్‌ అయ్యాకే ఢిల్లీలో స్కూల్స్‌  తెరిచేది

న్యూఢిల్లీ: కరోనాను పూర్తిగా నియంత్రించిన తరువాతే ఢిల్లీలో స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని, స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సేఫ్టీ తమకు ముఖ్యమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ అన్నా రు. ఇండిపెండెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా ఢిల్లీ సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాతీయ జెండా ఎగురవేసిన తరువాత ఆయన ప్రసంగించారు. ప్రతీ ఏడాది ఛత్రస ల్‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేడియంలో జరిగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కరోనా వ్యాప్తి కారణంగా ఈ సంవత్సరం సెక్రటేరియ ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించారు. ఢిల్లీలో రెండు నెలలతో పోలిస్తే ప్రస్తుం వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదుపులోనే ఉందని, దీనికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, కరోనా వారియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి, వివిధ సంస్ధలకు సీఎం కృతజ్ఞ తలు తెలిపారు. స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సేఫ్టీ ఆప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి చాలా ముఖ్యం అందుకే స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రీఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయబోమని అన్నారు. ఈ విషయంపై ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారు. కరోనాతో పోరాడుతూ డెంగీపై పోరాటాన్ని ఆపబోమని, ఈ ఏడాది సెప్టెం బర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘దస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాఫ్తే’ ప్రచార కార్యక్రమాన్ని స్టార్ట్ చే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తామన్నా రు.

చనిపోయిన కరోనా వారియర్స్‌కు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా..

కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ మరణించిన డాక్టర్లు, హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి రూ.కోటి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియా అందించారు. వారు చేసిన సేవను ప్రభుత్వం గుర్తు చేసుకుంటుందని, వారికి రుణపడి ఉంటామని సీఎం స్పష్టం చేశారు. అలాగే, వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కోలుకుని నెగెటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్టువచ్చిన వాళ్లు.. ఆక్సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడి పోవడంతో కుప్పకూలి పోతున్నట్టు రిపోర్టుల ద్వారా తెలిసిందని, వచ్చే వారం నుంచి వాళ్లకు ఆక్సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎకానమీ రివైవ్‌ చేయడం పెద్ద సవాలు.. ప్రస్తు పరిస్థితుల్లో ఎకానమీని రివైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం పెద్ద సవాలని, ఢిల్లీ ప్రజల సహకారంతో త్వరలోనే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడతామని కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను ఆయన వివరించారు. డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్నవ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను తగ్గించారు. దీంతో డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనిమిది రూపాయలు తగింది.

ప్లాస్మా థెరపీని ఇండియాకు ఇచ్చాం..

కరోనాపై పోరాటంలో కీలకంగా ఉన్న ప్లాస్మా థెరపీ, హోం ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియాకు పరిచయం చేశామని కేజ్రీవాల్ చెప్పారు. ప్రపంచ మంతా కరోనాతో ఇబ్బంది పడుతున్న సమయంలో.. ఢిల్లీలో వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యాప్తిని కంట్రోల్ చేశామని, ఆప్ గురించి దేశమంతా చర్చించుకుంటోందని చెప్పారు. అందరి సహకారం తీసుకొని పనిచేయడం వలనే వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యిందని, 2 కోట్లమంది ప్రజలకు ధన్యవాదాలు అని కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.