
నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ సోమవారం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం జనవరి 1వ తేదీని సాధారణ సెలవు దినంగా పేర్కొంటూ సెలవుల జాబితాను విడుదల చేసింది.
జనవరిలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు 14, 15, 26 తేదీల్లో సెలవులు ఉంటాయి. జనవరి 14న భోగికి పాఠశాలలు మూతపడనుండగా.., 15, 26వ తేదీల్లో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం సెలవులు రానున్నాయి. అదనంగా, కనుము దృష్ట్యా 16వ తేదీన ఐచ్ఛిక సెలవు ఉంది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు మార్చి 2024లో జరగనున్న సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ (SSC) పరీక్షకు సిద్ధమవుతున్నాయి.
విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, SSC పరీక్షలు మార్చి 18, సోమవారం ప్రారంభమై.. మంగళవారం, ఏప్రిల్ 2 న ముగుస్తాయి. టైం టేబుల్‌లో పేర్కొన్న ఏదైనా తేదీలో ప్రభుత్వం పబ్లిక్ హాలిడే లేదా సాధారణ సెలవు ప్రకటించినప్పటికీ, మార్చి 2024 SSC పబ్లిక్ పరీక్ష ఖచ్చితంగా టైంటేబుల్ ప్రకారం నిర్వహించబడుతుందని ప్రెస్ నోట్ పేర్కొంది. SSC, ఇతర వార్షిక పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో, హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల కోసం మూసివేయబడతాయి.